జేఈఈ మెయిన్ పేపర్-1 తొలి రోజు రెండు పరీక్షలు సులభం నుంచి మధ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు మూడు రోజులు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పేపర్-1 ఆన్‌లైన్ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల్లో ఆరు విడతల్లో జరిగే ఈ పరీక్షలకు 6.61 లక్షల మంది హాజరుకానున్నారు.
తొలిరోజు దాదాపు రెండు లక్షల మంది హాజరై ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యత చూస్తున్న జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తొలి రోజు హాజరు శాతాన్ని ప్రకటించలేదు. ఏపీలో 20, తెలంగాణలోని 10 నగరాలు, పట్టణాల్లో జరిగిన పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి ఇంటిజర్ ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వడంతో 300కి 300 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రసాయన, భౌతికశాస్త్రం ప్రశ్నలతో పోలిస్తే గణితం ప్రశ్నలకు కొంత ఎక్కువ సమయం పట్టినట్లు చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సులభంగా ఉందని ఆకాశ్ జాతీయ అకడమిక్ సంచాలకులు అజయ్‌కుమార్‌శర్మ తెలిపారు.
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచే ప్రశ్నలు