Jee main 2022: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ప్రవేశ పరీక్షలకు వారం పది రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయడం ఆనవాయితీ. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అయినా ఈ సంస్థ హాల్‌టికెట్లు జారీ చేయడంలో జాప్యం చేసింది.
జేఈఈ మెయిన్ మొదటి విడత హాల్ టికెట్లు రిలీజ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!! - Jee main 2022 session 1 admid cards
Jee main 2022:ఈ నెల 23 నుంచి 29 వరకు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు ఇతర దేశాల్లో 21 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. రోజూ రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తారు. కొవిడ్ లక్షణాలు లేవని విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే 011 - 40759000 ఫోన్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ తెలిపింది. రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా... మంగళవారం ఉదయం వరకు అడ్మిట్ కార్డులను విడుదల చేయకపోవడంపై ఎన్టీఏ తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెరాసకు మరో షాక్.. పార్టీని వీడతానన్న మాజీ ఎమ్మెల్యే.. అసలేమైంది?!