తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష - నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష

ఐఐటీల్లో బీటెక్​ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరగనుంది. రాష్ట్రంలో 15పట్టణాల్లో ఈ సారి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

jee advanced exam today
నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష

By

Published : Sep 27, 2020, 5:13 AM IST

ఐఐటీ ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మళ్లీ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పరీక్షకు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 222 నగరాలు, పట్టణాల్లో వెయ్యి కేంద్రాల్లో దిల్లీ ఐఐటీ ఆన్​లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. లక్ష 60వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 15 పట్టణాల్లో ఈ సారి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్​లో జేఈఈ అడ్వాన్స్ డ్ జరగనుంది.

రాష్ట్రం నుంచి సుమారు 15 వేల మంది దరఖాస్తు చేసినట్లు అంచనా. గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని... పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేదని దిల్లీ ఐఐటీ స్పష్టం చేసింది. మాస్కు ధరించాలని..సొంతంగా శానిటైజర్, వాటర్ బాటిల్ తీసుకోవచ్చునని సూచించింది. మధ్యాహ్నం పరీక్ష ప్రారంభమయ్యాక హాల్ టికెట్​ను కచ్చితంగా ఇన్విజిలేటర్​కు ఇవ్వాలని.. లేనిపక్షంలో అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను అక్టోబరు 5న విడుదల కానున్నాయి. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చే నెల 8న నిర్వహించి.. 15న ఫలితాలు ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.


ఇవీ చూడండి: సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం

ABOUT THE AUTHOR

...view details