తెలంగాణ

telangana

ETV Bharat / state

JC Prabhakarreddy on film industry: 'చిరంజీవిని చూస్తే ఏడుపొచ్చింది..' - ఏపీలో సినీ పరిశ్రమపై తెదేపా నేతల వ్యాఖ్యలు

JC Prabhakarreddy on film industry: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కక్షసాధింపు చర్య వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి సైతం మాట్లాడినా స్పందించకపోవడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్​ని ఏమి చేయలేక సినిమా వాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు.

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

By

Published : Feb 24, 2022, 5:34 PM IST

Updated : Feb 24, 2022, 6:50 PM IST

JC Prabhakarreddy on film industry: ఏపీ ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని తెదేపా నేత జేసీ ప్రభాకర్​ రెడ్డి ఆరోపించారు. సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

'తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే విధంగా ప్రోత్సాహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతేకానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నటించిన ఓ సినిమా ప్రివ్యూ కార్యక్రమంలో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్‌ హాజరవడంతో పవన్‌ కల్యాణ్‌కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ లాంటి వారికి ఇంకా ఎక్కవగానే ఉంటుంది. అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు, సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్‌ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి'. - జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌

జగన్‌కేనా ఇగో ఉండేది?..

'పవన్‌పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏమిటి? ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనరేషన్‌ ఆయనకొస్తుంది. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి. సీఎం జగన్‌ తీసుకున్న చర్యల వల్ల పవన్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. జగన్‌కేనా ఇగో ఉండేది. ఇగో.. అందరికీ ఉంటుందని తెలుసుకోవాలి. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి. సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు ఆపాలి. సీబీఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఉండకూడదా?. ఈరోజు నేను చెబుతున్నా.. ఏ ఒక్క డైరెక్టర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి షూటింగ్‌ చేయరు. చిరంజీవి గారిని చూస్తే ఏడుపొచ్చింది. కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడించి మిమ్మల్ని అడిగారు. ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు. చిరంజీవి సైతం మిమ్మల్ని చేతులు జోడించి ప్రాథేయపడాలా? ఆయనకు ఏం తక్కువ. చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకుదెరువు కోసం కాదు.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు. నిన్ను ఎవరూ క్షమించడంలా. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్‌ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్‌ బాయ్‌ వరకు అందరూ నాశనమైపోతారు'.- జేసీ ప్రభాకర్‌ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌

ఇదీ చూడండి :Mogilaiah Kinnera Damage : పవన్​ అభిమానుల తాకిడికి దెబ్బతిన్న మొగిలయ్య కిన్నెర

Last Updated : Feb 24, 2022, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details