జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ - జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజా వార్తలు
11:44 November 30
జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ED Attach JC Prabhakar Reddy Assets: టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం అటాచ్ చేసింది. దివాకర్ రోడ్‌లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్, సి.గోపాల్ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసింది. రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఈడీ పేర్కొంది. జటధార ఇండస్ట్రీస్ బీఎస్-4 వాహనాలు కొనుగోలు చేసిందని తెలిపింది. గోపాల్‌రెడ్డి అండ్ కో బీఎస్-4 వాహనాలు కొనుగోలు చేసిందని ఈడీ వెల్లడించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాల కొనుగోలు జరుగుతన్నట్లు పేర్కొంది. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్‌లో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. రూ.38.36 కోట్ల అక్రమ క్రయ, విక్రయ లావాదేవీలు గుర్తించామన్న ఈడీ అధికారులు.. అశోక్ లేలాండ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇవీ చదవండి: