మరికొద్దిసేపట్లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రారంభం - jbs-mgbs metro to start sooner by cm kcr
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన మెట్రోలో మూడో మార్గం కాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

కాసేపట్లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్ మెట్రోలోని మరో కీలక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్లో ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్ హాజరుకానున్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో 9 స్టేషన్లను కలుపుకుంటూ మెట్రో రైలు పరుగులు తీయనుంది. 2017 నవంబర్ 28 నుంచి భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు.. ఇప్పుడు మూడు మార్గాల్లో ప్రయాణిస్తోంది.