ఆచార్య జయశంకర్ 86వ జయంతి సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఆచార్య కోదండరామ్ పూలమాల వేసి నివాళులర్పించారు. 1952లో జరిగిన ముల్కి ఉద్యమం నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.
'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి భూమిక.. మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి ఆచార్య జయశంకర్ అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆచార్య కోదండరామ్ అన్నారు. ఆయన లేనిదే తెలంగాణ రాష్ట్ర సాధన ఊహించలేమని అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'
తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమం ప్రారంభం కావడానికి ముఖ్యపాత్ర పోషించటమే కాకుండా ప్రజలను చైత్యన్య వంతులు చేశారని అన్నారు. జయశంకర్ లేకపోతే రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు. తెలంగాణ పితామహుడు జయశంకర్ ఆశించిన ఆశయాలను నెరవేర్చేందుకు ఐకమత్యంగా పోరాటం చేస్తామని కోదండరామ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :కరోనాతో బాచుపల్లి ఎస్ఐ యూసుఫ్ మృతి
TAGGED:
ఆచార్య జయశంకర్ 86వ జయంతి