ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రెండో విడత అగ్రికల్చర్ డిప్లొమా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 3వ వరకు ప్రక్రియ కొనసాగనుంది.
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలో రెండో విడత కౌన్సిలింగ్ - jaya shankar university second counselling
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రెండో విడత అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఆగస్టు 3వ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో పొందుపరిచినట్లు రిజిస్ట్రార్ డా. ఎస్. సుధీర్‌కుమార్ పేర్కొన్నారు. మెరిట్ లిస్ట్ ప్రకారం నిర్ణీత తేదీల్లో అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. సీటు పొందిన అభ్యర్థులు వెంటనే ఫీజు చెల్లించాలని.. లేకుంటే సీటు తక్షణం రద్దవుతుందని స్పష్టం చేశారు. సీట్ల లభ్యతకు సంబంధించిన వివరాలు ప్రతి రోజు సాయంత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రార్ తెలిపారు.
ఇవీ చూడండి: ఎంటెక్ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు