Jawad Cyclone Effect in AP: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి. బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల దూరం తీరాన్ని ధ్వంసం చేశాయి. పార్కు గోడ కూలిపోయింది. భూకంపం తర్వాతి పరిస్థితిని తలపించేలా నేల చీలిపోయి పచ్చిక బయళ్లు కిందకు కుంగిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు ఆదివారం ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. సందర్శకులను అనుమతించలేదు.
Jawad Cyclone effect on vishaka : విశాఖ తీరాన ‘అల’జడి! - Jawad Cyclone Effect in AP
Jawad Cyclone Effect in AP: ఏపీలోని విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్ తుపాను కారణంగా మూడు రోజులుగా అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి.
జవాద్ తుపాను
తుపాను అలజడి తగ్గడంతో తీరంలో అలలు కాస్త వెనక్కి వెళ్లాయి. దీంతో విశాఖపట్నం తీరంలోని తెన్నేటి పార్కు సమీపానికి గత ఏడాది కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక అడుగుభాగం మొత్తం బయటకి కన్పిస్తోంది. దీంతో సందర్శకులు నౌక చెంతకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. సముద్రపు నీటిలో మునిగి ఉండే రాళ్లు సైతం బయటపడి ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి:Jawad cyclone in AP: జవాద్ ఎఫెక్ట్.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు