హైదరాబాద్ అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్-జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్-2019 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాగ్యనగరంలో గత 20 ఏళ్లుగా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుభాషా చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఆయా దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని జయేష్ రంజన్ తెలిపారు.
నగరంలో హైదరాబాద్-జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్ - హైదరాబాద్
నగరంలో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. అమీర్‌పేటలో హైదరాబాద్-జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్-2019 ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఆయా దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను నగర వాసులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్ క్లబ్ వైస్ ఛైర్మన్ శ్యామ్ గోపాల్ కౌసిరీ పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎక్కడ దొరకవని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌క్లబ్, శ్రీ సారథి స్టూడియో, కాన్సులేట్-జనరల్ ఆఫ్ జపాన్ ఇన్ చెన్నై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత కళ్యాణ్, చలనచిత్ర అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రైతు మృతిపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం: ఉత్తమ్