తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - janmashtami in thirumala

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఉత్సవాలను ఏకాంతంగా జరుపుతున్నారు.

tirumala
తిరుమలలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

By

Published : Aug 12, 2020, 11:01 PM IST

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంట‌ల వ‌ర‌కు ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన జరిపారు.

ఉట్లోత్సవాన్ని పుర‌స్కరించుకొని గురువారం సాయంత్రం.. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను నిరాడంబరంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details