నేడు జనతా కర్ఫ్యూ వల్ల నగరంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్‌లోని ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఉప్పుగూడ, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. వ్యాపారులూ స్వచ్ఛదంగా తమ తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు.
ఫలితంగా జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు లేక ఫలక్నుమా, ఫారూఖ్ నగర్ బస్స్టాండ్లు, ఫలక్నుమా రైల్వేస్టేషన్ వెలవెలబోయాయి. అత్యవసర సేవల కోసం ఫలక్నుమా, ఫారూఖ్నగర్ డిపోల్లో 5 బస్సులను అందుబాటులో ఉంచారు.