Pawan Kalyan called Mahasena Rajesh: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో మహాసేన రాజేష్‌పై జరిగిన దాడి అప్రజాస్వామికమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మహాసేన రాజేష్‌కి పవన్ కల్యాణ్ ఫోన్ చేసి దాడి పూర్వాపరాలు తెలుసుకుని పరామర్శించారు. ప్రజా సమస్యలపై, పాలన వ్యవస్థలోని లోపాలపై స్పందిస్తున్న రాజేష్ తీరును జనసేనాని అభినందించారు.
వైసీపీ దోపిడీలను ప్రశ్నించినందుకే అతనిపై దాడి: పవన్ కల్యాణ్ - Rajamahendravaram news
Pawan Kalyan called to Mahasena Rajesh: అధికార పార్టీ దోపిడీలు, దాష్టీకాలను ప్రశ్నిస్తున్న గొంతును నిలువరించే ప్రయత్నంలోనే మహాసేన రాజేష్‌పై దాడి చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో దాడి అప్రజాస్వామికమని అన్నారు. మహాసేన రాజేష్‌కు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Pawan Kalyan called Mahasena Rajesh
అధికార పార్టీ నాయకుల దోపిడీలు, దాష్టీకాలను ప్రశ్నిస్తున్న గొంతును నిలువరించే ప్రయత్నంలోనే అతనిపై దాడి చేశారని ఆరోపించారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా సాగుతున్న దాడులను ప్రజాస్వామ్య విధానాలపై విశ్వాసం ఉన్నవారు ఖండించాలన్నారు. గోదావరి జిల్లాల్లో హింసపూరిత వాతావరణాన్ని అధికార పార్టీ నాయకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: