ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని భాజపా, జనసేన నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దిల్లీలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఏపీ పరిణామాలు, దాడుల వ్యవహారాలన్ని ఆయనకు వివరించారు.
ఏపీలో కలిసి పనిచేయాలని భాజపా, జనసేన నిర్ణయం - భాజపా జనసేన న్యూస్
దిల్లీలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు.
కలిసి పనిచేయాలని భాజపా, జనసేన నిర్ణయం
అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని నడ్డా వివరించారు. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు అమరావతిపై త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇవే అంశాలపై వారం కిందట కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యతో చర్చించినట్లు సమాచారం. ఇతర రాజకీయ అంశాలు చర్చించలేదని జనసేన వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం