విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికులు, నిర్వాసితుల నిరసనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు సంఘీభావం ప్రకటించనున్నారు (pawan kalyan vizag tour). అనంతరం కూర్మన్నపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తవగా.. అన్ని జిల్లాల నుంచి జనసైనికులు తరలివచ్చారు.
PAWAN VSP TOUR : విశాఖలో ఇవాళ పవన్ కల్యాణ్ సభ - ap news
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖ చేరుకుంటారు (pawan kalyan vizag tour). విశాఖ ఉక్కు కోసం దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించనున్నారు.
pawan kalyan
మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ చేరుకోనున్న పవన్.. మూడింటికి బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా వాహనాల మళ్లింపు చేపట్టడమే కాక పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు.
ఇదీ చదవండి:janasena: విశాఖలో జనసేన బహిరంగ సభకు పోలీసుల అనుమతి