Janasena Party Advisor met CM KCR: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జనసేన పార్టీ సలహాదారుడు, తమిళనాడు మాజీ సీఎస్ ఆర్.రామ్మోహన్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారధి, తదితరులతో పాటు బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసిన రామ్మోహన్రావు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇతర విషయాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎస్‌గా శాంతికుమారిని నియమించినందుకు కేసీఆర్‌కు రామ్మోహన్రావు, భారాస ఏపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సీఎస్ శాంతికుమారిని అభినందించారు. గతంలో తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన ఆర్. రామ్మోహన్రావు.. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి అడ్వైజర్‌గా ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో భారాస కార్యకలాపాలు ఊపందుకుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు.