కూకట్పల్లి నియోజకవర్గంలో నష్టపరిహారం అందని వరద బాధితులకు వెంటనే 10వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు జోనల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ తరఫున కూకట్పల్లి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట జనసేన ఆందోళన - hyderabad news
కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట జనసేన నేతలు నిరసన చేపట్టారు. నష్టపరిహారం అందని బాధితులకు వెంటనే 10వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.
కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట జనసేన ఆందోళన
తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెబుతామన్నారు.