తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోడ్లు ఎలా ఉన్నాయో.. జగన్​ పాలన అలానే ఉంది' - అనంతపురంలో నాగబాబు పర్యటన

Road Repairs In Anantapur: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో రెండేళ్ల నుంచి గుంతలమయంగా ఉన్న రోడ్డుకి వైసీపీ నేతలు హడావిడిగా మరమ్మతులు చేపట్టారు. జనసేన నేత నాగబాబు పర్యటనలో భాగంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువు కట్టపై గుంతలు పడిన రోడ్డును పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు నిన్న సాయంత్రం రోడ్డుకి హడావిడిగా మరమ్మతులు చేపట్టారు. పర్యటనకు వచ్చిన నాగబాబు రోడ్లని పరిశీలించి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వ పాలన కూడా అలానే ఉందని విమర్శించారు.

Nagababu visit to Anantapur district
అనంతపురం జిల్లాలో నాగబాబు పర్యటన

By

Published : Jan 22, 2023, 10:52 PM IST

Road Repairs In Anantapur: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో రెండేళ్లుగా గుంతలు పడిన రోడ్డును వైసీపీ నాయకులు హడావిడిగా మరమ్మతులు చేపట్టారు. జనసేన నేత నాగబాబు అనంతపురం జిల్లా చేరుకున్నారు. ఇవాళ ఆయన కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెరువు కట్టపై గుంతలు పడిన రోడ్డును పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు నిన్న సాయంత్రం 50 మీటర్ల మేర రోడ్డుకు హడావిడిగా మరమ్మతులు చేయడానికి చర్యలు చేపట్టారు.

రాత్రి సమయంలోనూ జేసీబీలతో గుంతలు తీసి కంకర వేశారు. నాయకులు వచ్చి పరిశీలిస్తే గానీ రోడ్డు మరమ్మతులు చేయాలనే ఆలోచన వైసీపీ నాయకులకు లేదని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వ పాలన కూడా అలానే ఉందని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు అన్నారు. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా చెరువు కట్ట పైన ఉన్న రోడ్డు గుంతలను, నిర్మాణ పనులను పరిశీలించారు. నాగబాబు వస్తున్నారని రాత్రికి రాత్రి అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. జనసేన నాయకులు రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం చేపట్టిన విషయం తెలిసిందేనని, చెరువు కట్టపై గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు పనులు చేపట్టడం మంచిదేనని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యంలో దేశద్రోహులు తప్ప.. మంచి పనిని ఎవరైనా చేయాల్సి ఉందని చెప్పారు. జీవో నెంబర్ 1 విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ముటక్కాయ వేసినట్లు ఉందని విమర్శించారు. పోలీసులు, ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడే చేస్తూనే ఉంటామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details