Nagababu Comments On RK Roja: దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉండడంపై.. మంత్రి రోజాపై నటుడు, జనసేన నేత నాగబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడం అని మంత్రి తెలుసుకోవాలని హితవు పలికారు. ఇక చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రోజా.. మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణమని చెప్పారు. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని నాగబాబు ధ్వజమెత్తారు.
"భారతదేశపు పర్యాటక రాష్ట్రాల రాకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో.. మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ ఉన్నాయి. ఏపీ 18వ స్థానంలో ఉంది. రోజా మీ బాధ్యతలు మర్చిపోయి ఇలాగే ఉంటే మీరు పదవిదిగిపోయేలాగా 20వ స్థానానికి పడిపోతుంది. ఏపీలో పర్యాటకం మీద చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు. అభివృద్ధి చేయడం అని రోజా తెలుసుకోవాలి. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు." - నాగబాబు, నటుడు, జనసేననేత