ఆంధ్రప్రదేశ్లోనిఅమరావతిపర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ వెలగపూడి, మందడం రైతుల దీక్షాశిబిరాలకు వెళ్లి వారి ఆందోళనలకు మద్దతిచ్చారు. రైతులు, మహిళలపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ప్రజల నమ్మకం కోల్పోయిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదన్నారు. రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కాకూడదని హితవుపలికారు. రాజధాని తరలింపును రియల్ ఎస్టేట్ ఆటలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానులకు కేంద్రం మద్దతు లేదు: పవన్ - మందడంలో పవన్ పర్యటన వార్తలు
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతు లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. తాను కేంద్రపెద్దలతో మాట్లాడానని... వారంతా అమరావతికే కట్టుబడి ఉన్నట్లు తనకు చెప్పారని స్పష్టం చేశారు.
Pawan kalyan
3 రాజధానుల అంశం సమ్మతం కాదని కేంద్ర పెద్దలు తనతో చెప్పారని పవన్ స్పష్టం చేశారు. భాజపాతో పొత్తుపెట్టుకునేటప్పుడు దీనిపై స్పష్టత తీసుకున్నానని వివరించారు. భాజపా, జనసేన రెండు పార్టీలు అమరావతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ప్రధాని మోదీతో భేటీలో రాజధానికి నిధులు అడిగామని ఏపీ సీఎం జగన్ అంటున్నారని... ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్