తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల బరిలో జనసేన: పవన్​ కల్యాణ్

జీహెచ్​ఎంసీ ఎన్నికలో జనసేన పోటీ చేస్తుందని పవన్​ కల్యాణ్​ వెల్లడించారు. కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జనసేనాని సూచించారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Nov 17, 2020, 4:45 PM IST

Updated : Nov 17, 2020, 7:38 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జనసేనాని పవన్​ కల్యాణ్​ వెల్లడించారు. క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. వారి వినతి మేరకు జీహెచ్​ఎం​సీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు, నగర పరిధిలోని కమిటీలకు పవన్​ స్పష్టం చేశారు.

నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎం​సీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ... ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్​ఎం​సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది.

- పవన్ కల్యాణ్

45 నుంచి 60 డివిజన్లలో పోటీ చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ శంకర్​ గౌడ్​ తెలిపారు. కార్యకర్తలు, కమిటీ ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. క్రియాశీల కార్యకర్తలు, యువ జనసైనికులను బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని ప్రధాన సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

Last Updated : Nov 17, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details