ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య ఘర్షణలు రౌడీ రాజకీయాలను తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నిన్న పవన్, చంద్రబాబును వైకాపా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. తమ నాయకుడిపై బూతులు మాట్లాడుతారా అంటూ జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన కార్యకర్తలను వైకాపా వర్గీయులు కొట్టారు.
కాకినాడలో వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ - వైకాపా వర్సెస్ జనసేన
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన కార్యకర్తలను వైకాపా శ్రేణులు కొట్టారు. జనసేన కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో వైకాపా వర్గీయుల దాడి చేశారు. పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

కాకినాడలో వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ
కాకినాడలో వైకాపా, జనసేన వర్గాల మధ్య ఘర్షణ
జనసేన కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో వైకాపా శ్రేణులు దాడి చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి జనసేన కార్యకర్తలు బయలుదేరగా... వైకాపా వర్గీయులు భారీగా వచ్చారు. జనసేన కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జనసేన కార్యకర్తలు, మహిళా నాయకులను స్థానిక సాయిబాబా ఆలయంలోకి పంపారు. వారిని ఆలయం నుంచి బయటకు పంపాలని వైకాపా కార్యకర్తల నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: మన అన్నదాతకు పండగెక్కడయ్యా?