భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికలపైనే మాట్లాడాలని కానీ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. సొంత పార్టీలోనే ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దు: జానారెడ్డి అవగాహన లేకుండా వ్యవహరించడం సరికాదని.. అనుచరుల అత్యుత్సాహం నేతలకు నష్టం చేకూరుస్తుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో దూషణలు చేయడం పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గీతదాటే కార్యకర్తలపై పార్టీ కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీని బలహీనపరిచే వారిపై చర్యలకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు.
లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతా సమావేశమై.. అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు అందరు ఐక్యమత్యంగా రేపటి నుంచి వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుకు ఒకాయన ఫోన్ చేసి వాడిన భాష సరైంది కాదన్నారు. ఈ సాంప్రదాయం కాంగ్రెస్ విధానం కాదని వెల్లడించారు. 20 నుంచి 30 ఊర్ల పేర్లు చెబుతానని.. మీడియాకు రవాణా సౌకర్యం కల్పిస్తానని… భగీరథ నీళ్లు ఎక్కడ వస్తున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. నేతలు పార్టీని వీడటానికి కారణం కాంగ్రెస్ లోపం కాదని. సమాజం లోపమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలి: హైకోర్టు