ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గాంధీభవన్‌లో జనగామ కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. జనగామ నియోజక వర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించగా, జనగామ నుంచి పొన్నాల, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి ఓటు వేసేందుకు చేరుకోగా చివరి క్షణంలో ఓటరు జాబితాలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించారు.
గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గందరగోళం - telangana congress party
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి వర్గపోరు బయటపడింది. గాంధీభవన్‌లో జరుగుతున్న పోలింగ్‌లో ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రే పేరెలా మారుస్తారంటూ సిబ్బందిపై మండిపడ్డారు.
congress
శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మురు ప్రతాప్ రెడ్డి పేరును చేర్చారు. నిన్న రాత్రి కొమ్మూరు పేరును చేర్చిన రాష్ట్ర నాయకులు చేర్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో కొమ్మూరి పేరు చేర్చడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డ ఆయన... శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొన్నాలకు జానారెడ్డి సర్దిచెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా పీఆర్వో ఆపారు.
ఇవీ చదవండి: