ఎలాంటి క్లినికల్ పరీక్షలు లేకుండా తయారు చేసిన పతంజలి సంస్థ కరోనిల్ మందును రద్దు చేయాలని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పి.వరప్రసాద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ నివారణకు తయారుచేసిన మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని వారు ఆరోపించారు. కేంద్రమంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ ఆ మందులను విడుదల చేసి చేయడం సమంజసం కాదని అన్నారు.
'కరోనిల్ మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదు'
కరోనా వైరస్ నివారణకు పతంజలి సంస్థ తయారుచేసిన కరోనిల్ మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి పి.వరప్రసాద్ అన్నారు. ఆ మందును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేయడం సమంజసం కాదని తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'కరోనిల్ మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదు'
కరోనిల్ మందు అందరూ వాడాలని కేంద్ర మంత్రులు చెప్పడం తగదన్నారు. అన్ని రకాల శాస్త్రీయ పరీక్షలు పూర్తి చేశాకే అనుమతి ఇవ్వాలని సూచించారు. భారత వైద్య మండలి ఆదేశాలను పాటించాలని కోరారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలని వరప్రసాద్ డిమాండ్ చేశారు.