తెలంగాణ

telangana

ETV Bharat / state

సుపరిపాలనకే ఓటేయండి: జన్​ సేవా సంఘ్ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020 తాజా అప్డేట్స్

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మతానికో, మందుకో కాకుండా సుపరిపాలనకే ఓటేయాలని జన్ సేవా సంఘ్ విజ్ఞప్తి చేసింది. రాజకీయ వృత్తితో కాకుండా అంకిత భావం గల నాయకులనే ఎన్నుకోవాలని సంఘ్ నాయకులు సూచించారు.

jan seva sangh comments on ghmc elections
సుపరిపాలనకే ఓటేయండి: జన్​ సేవా సంఘ్

By

Published : Nov 28, 2020, 2:08 PM IST

డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా సుపరిపాలనకే ఓటు వేయాలని జన్ సేవా సంఘ్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు సర్కస్​లాగా మారాయని... రాజకీయ నేతలు ప్రజలను తోలు బొమ్మలుగా మారుస్తున్నారని సంఘ్ నేతలు ఆరోపించారు. కులానికో... మతానికో... లేక మందుకో లేదా డబ్బుకో ఓటు వేయకుండా... స్వచ్ఛమైన పాలన కోసం ఓటు వేయాలని కోరారు.

మంచి అభ్యర్థి లేనిచోట నోటాకైనా ఓటు వేయాలని సూచించారు. రాజకీయ వృత్తితో కాకుండా సేవా, అంకిత భావం గల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details