జమ్ముకశ్మీర్ పర్యాటక విభాగంతో కలిసి అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ టూర్ ఆపరేటర్స్ హైదరాబాద్‌లో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం మహిళలకు సంబంధించి సున్నా క్రైమ్ రేటు ఉందని అసోసియేషన్ ప్యాట్రన్ చీఫ్ నజీర్ అహ్మద్ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో 12 నెలలు పర్యటించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి 12 లక్షల మంది జమ్ముకశ్మీర్‌ను సందర్శిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో పర్యటకుల సంఖ్య 25 లక్షలకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి దాదాపు 150 మంది జమ్ముకశ్మీర్‌కు టూర్లను అందిస్తున్నట్లు నజీర్ అహ్మద్ వెల్లడించారు.
'కశ్మీర్‌ను సందర్శించండి...రాయితీ పొందండి' - jammu and kashmir Tourism Road Show at Hyderabad latest news
పర్యటనలకు జమ్ముకశ్మీర్ సురక్షితమైనదని అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ టూర్ ఆపరేటర్స్ ప్యాట్రన్ చీఫ్ నజీర్ అహ్మద్ అన్నారు. కశ్మీర్‌ను సందర్శించే వారికి టూరిజం ఫీజులో రాయితీ కల్పిస్తామన్నారు.
jammu and kashmir Tourism today news