ప్రస్తుత సామాజిక పరిస్థితులలో కుటుంబ వ్యవస్థ కుంటుపడిందని, కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని జమాతె ఇస్లామీహింద్ తెలంగాణ అధ్యక్షురాలు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. బలహీనమవుతున్న కుటుంబవ్యవస్థను పటిష్ఠం చేసుకునేందుకు పది రోజుల ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
'కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకే ప్రచారం ఉద్యమం' - జమాతె ఇస్లామీహింద్ తెలంగాణ అధ్యక్షురాలు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్
ప్రజల్లో కుటుంబవ్యవస్థ పట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు పదిరోజులు ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని జమాతె ఇస్లామీహింద్ తెలంగాణ అధ్యక్షురాలు మౌలానా హామిద్ తెలిపారు. పటిష్ఠ కుటుంబం- పటిష్ఠ సమాజం నినాదంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
'కుటుంబవ్యవస్థను పటిష్ఠం చేసేందుకే ప్రచారం ఉద్యమం'
వివాహ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇంట్లో వయోవృద్ధుల హక్కులను కాపాడటం, కుటుంబ విలువలపట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పటిష్ఠ కుటుంబం-పటిష్ఠ సమాజం నినాదంతో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్నర్ మీటింగులు, ఫ్యామిలీ క్విజ్ పోటీలు, వివిధ మత పండితులతో చర్చా గోష్ఠులు, వెబినార్లు, కుటుంబ సర్వేలు నిర్వహిస్తామని తెలిపారు.