తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2019, 7:37 AM IST

Updated : Dec 5, 2019, 8:56 AM IST

ETV Bharat / state

100 శాతం నల్లా బిల్లులు వసూలు కావాలి: దాన కిశోర్​

ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో పలు అంశాలపై ఎండీ దాన కిశోర్​ సమీక్షించారు. ఇంటింటి సర్వేతో రెవెన్యూ పెరిగినట్లు ఆయన తెలిపారు. నల్లా కనెక్షన్​ వినియోగదారుల నుంచి 100 శాతం బిల్లులు వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  వీడీఎస్​పై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను దాని కిశోర్​ ఆవిష్కరించారు.

100 శాతం నల్లా బిల్లులు వసూలు కావాలి: దాన కిశోర్​
100 శాతం నల్లా బిల్లులు వసూలు కావాలి: దాన కిశోర్​


రెవెన్యూ పెంచేందుకు వీడీఎస్, ఇంటింటి సర్వే, వాక్ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టు, వాక్, జీఐఎస్ తదితర అంశాలపై దానకిశోర్ సమీక్ష నిర్వహించారు.

100 శాతం నల్లా బిల్లులు వసూలు కావాలి: దాన కిశోర్​

100 శాతం వసూలు చేయాలి..

ఇంటింటి సర్వేతో జలమండలి రెవెన్యూ పెరిగినట్లు ఎండీ తెలిపారు. నల్లా కనెక్షన్ వినియోగదారులు 100 శాతం బిల్లులు జారీ చేసి... 100 శాతం వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు 50 వేలకు పైగా బకాయిలు ఉన్న కనెక్షన్ల నుంచి బిల్లులు వసూలు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

రెడ్​ నోటీసులు..

బిల్లులు చెల్లించకపోతే రెడ్ నోటీసులు జారీ చేసి కనెక్షన్ తొలగించాలని దాన కిశోర్​ ఆదేశించారు. వీటితో పాటు అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్దీకరించుకోవడానికి ప్రవేశపెట్టిన వీడీఎస్ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించాలన్నారు. వీడీఎస్​పై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఎండీ ఆవిష్కరించారు.

టీఎస్​- ఐపాస్​ ప్రథమ అవార్డు:

మరోవైపు టీఎస్ ఐపాస్ ప్రధానం చేసిన అవార్డుల్లో జలమండలికి మూడో కేటగిరీలో ప్రథమ అవార్డు లభించింది. ఓఆర్ఆర్ పరిధిలో జలమండలి 87 పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇచ్చినందుకు గాను ఈ అవార్డు మంత్రి కేటీఆర్ అందించారు.

ఇవీ చూడండి: 'టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక'

Last Updated : Dec 5, 2019, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details