హైదరాబాద్ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో అధికారులతో ఎండీ దానకిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్‌లోపు మొత్తం వాణిజ్య బకాయిలు వసూలు పూర్తిచేయాలని ఆదేశించారు. వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు - ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
జలమండలి రెవెన్యూ వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ దాన కిషోర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు బకాయి ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించి వసూళ్లలో వేగం పెంచాలన్నారు.
దాన కిషోర్
కలుషిత నీరు సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ అమలు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
ఇదీ చదవండి:'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం