హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రెయిన్ హార్వెస్టింగ్ థీమ్ పార్కులో జలమండలి ఆధ్వర్యంలో నీటి పొదుపుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చిన వాలంటీర్లు పాల్గొన్నారు. అధికారులతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు వాక్ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎండీ దాన కిశోర్ వివరించారు. నగరంలోని 150వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 2500ఇళ్లను ఎంపిక చేసుకుని నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ప్రతి వారం ఒక గంట సేపు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించాలని పేర్కొన్నారు.
మనకో వాటర్ మ్యాన్ కావాలి: దాన కిశోర్ - Jalamandali_Md
నీటి వనరులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని వెల్లడించారు. అందుకే జలం పొదుపు గురించి జనులను నడిపించేందుకు జల నాయకులు కావాలని తెలిపారు.
మనకో వాటర్ మ్యాన్ కావాలి: దాన కిషోర్