Jalamandali on Vaddera basti Issue: మాదాపూర్ వడ్డెరబస్తీలో ప్రజల అనారోగ్యానికి తాము సరఫరా చేసే నీరు కారణం కాదని... జలమండల స్పష్టం చేసింది. ఆ బస్తీలో సరఫరా అయిన మంచినీటిలో 44 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరిపిన జలమండలి.. ఆ నీటిలో తగు మొతాదులో క్లోరిన్ ఉందని తెలిపింది. అందులో ఎలాంటి బాక్టీరియా ఆనవాళ్లు కూడా లేవని ఈ పరీక్షల్లో తేలినట్లు వివరించింది. ఘటన జరిగిన ప్రదేశంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ నీరు సురక్షితమైందని పరీక్షల్లో తేలింది. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా... జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని తాగవచ్చని స్పష్టం చేసింది.
మాదాపూర్ వడ్డెర బస్తీ ఘటనపై వివరణ ఇచ్చిన జలమండలి - telangana varthalu
Jalamandali on Vaddera basti Issue: మాదాపూర్ వడ్డెరబస్తీలో ప్రజలు అనారోగ్యం బారిన పడిన సంఘటనకు జలమండలి సరఫరా చేస్తున్న మంచినీరే కారణమని వస్తున్న వార్తలు అవాస్తమని జవలమండలి తెలిపింది. నీటిని పరీక్షించిన జలమండలి.. వాటిలో ఎటువంటి బ్యాక్టీరియా లేదని, అనారోగ్యానికి మంచినీరు కారణం కాదని తేల్చి చెప్పంది. దీంతో పాటు ఘటన దృష్ట్యా వివరణ ఇచ్చింది.
ఈ నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా కూడా లేదని ప్రాథమికంగా తేలింది. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా నీరు సురక్షితమైనదని పరీక్షల్లో తేలింది. వడ్డెరబస్తీ ఘటనకు జలమండలి సరఫరా చేసిన మంచినీరు కారణం కాదని అందరూ గుర్తించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు జలమండలి నీటిపై ధైర్యం కల్పించేందుకు ప్రజల ముందే జలమండలి సిబ్బంది ఈ బస్తీలో సరఫరా అయిన నీటిని తాగి చూపించారు. ఈ ఘటనకు జలమండలి నీరు కారణం కాకపోయినప్పటికీ ఈ ప్రాంతానికి సరఫరా చేస్తున్న నీటిపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్నల్ క్యూఏటీ బృందం, ఐపీఎం, థర్డ్ పార్టీ బృందాల ద్వారా నీటిని పరీక్షించగా ఇక్కడి నీరు సురక్షితమైనదిగా వెల్లడైంది. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని జలమండలి కోరింది. చుట్టు పక్కల ప్రాంతాలైన జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సొసైటీ, కావూరి హిల్స్, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీలో ప్రాంతాల్లో కూడా నీటి నాణ్యత బాగుందని జలమండలి వెల్లడించింది.
ఇదీ చదవండి: హైటెక్ సిటీలో కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత