లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన రెండు నెలల నుంచి వాణిజ్య భవనాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర కార్యాలయాలు మూసి ఉన్నాయి. లాక్డౌన్ 4.0లో వాటిని తెరిచేందుకు అధికారులు అనుమతులిచ్చారు. భవనాల్లోని నీటి నిల్వలు... ఇప్పుడు ఉపయోగించవద్దని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు.
తాజా నీటిని నింపాకే వాడుకోండి: దానకిషోర్ - jala mandali md orders not to use stored water
లాక్డౌన్ వల్ల భవనాల్లో రెండు నెలలుగా ఉన్న నీటి నిల్వలను ఉపయోగించవద్దని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. తాజా నీటితో సంపులు, ట్యాంకులు నింపుకున్నాక వాడాలని ఆయన కోరారు.
![తాజా నీటిని నింపాకే వాడుకోండి: దానకిషోర్ jala-mandali-md-dana-kishore-orders-on-water-storage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7271816-thumbnail-3x2-dana.jpg)
తాజా నీటిని నింపాకే వాడుకోండి: దానకిషోర్
భవనాల్లోని సంపులు, ట్యాంకుల్లో నిల్వ ఉండిపోయిన నీటిని తొలిగించాలని.. వాటిని పూర్తిగా శుభ్రపరచుకున్నాకే వాడాలని ఆయన కోరారు. తాజా నీటితో సంపులు, ట్యాంకులు నింపుకుంటే ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరవని దానకిషోర్ వివరించారు.
ఇవీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు