తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ పథకం భేష్ - తెలంగాణలో పర్యటించిన జల్​ జీవన్ అధికారులు

2024 నాటికి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందుగా తెలంగాణ సాధించిందని జల్ జీవన్ మిషన్ టాస్క్ ఫోర్స్ ప్రశంసించింది. మిషన్ భగీరథతో నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని అధికారులను అభినందించింది.

Jal Jeevan Mission Task force Tour in Telangana
మిషన్ భగీరథ పథకం భేష్

By

Published : Jan 20, 2020, 8:17 PM IST

2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, ఇంటెక్ వెల్స్​తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది.

ఇవాళ ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను, భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్​కు అధికారులు వివరించారు. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందించారు.

మిషన్ భగీరథ పథకం భేష్


ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

ABOUT THE AUTHOR

...view details