Firing in Central Superfast Express at Maharashtra : జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పుల ఘటనలో మృతి చెందిన హైదరాబాదీ సయ్యద్ సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజుమ్ షాహీన్‌ను కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని కేటీఆర్ ఆమెకు అందజేశారు. దీంతో పాటు జియాగూడలో రెండు పడక గదుల ఇంటి మంజూరు పత్రాన్ని ఇచ్చారు.
KTR Giving 6 Lakh for Syed Saifuddin Family : బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.రెండు లక్షలు, మజ్లిస్ పార్టీ నుంచి రూ.లక్ష చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మృతుడి భార్యకు చెక్కులు అందజేశారు. ఈ ఘటనలో ఓ అధికారి, ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. అందులో హైదరాబాదీ సయ్యద్ సైఫుద్దీన్ ఒకరు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పిల్లలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆరు లక్షల రూపాయలను బీఆర్ఎస్ తరఫున అందజేశారు. సైఫుద్దీన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, తదితరులు పాల్గొన్నారు.
Gun Firing At Old City : పాతబస్తీలో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ రివాల్వర్‌తో..
అసలు ఏం జరిగిందంటే ..: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపుర్-ముంబయి సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన పైఅధికారి ఏఎస్సై టికా రామ్ మీనాన్పై ఏకే-47 తుపాకీతో కాల్పులు చేశాడు. దీంతో అధికారి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆ కానిస్టేబుల్ రైలులోని ఎస్6, బీ5 బోగీల్లో ఉన్న ప్యాంట్రీ కార్లో ఒక్కో ప్రయాణికుడి చొప్పున కాల్పులు చేశాడు. ఆ ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.