తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మేధావి' - జైపాల్​ రెడ్డి సంస్మరణ సభలో రాజకీయ ప్రముఖుల సంతాపం

కేంద్ర మజీ మంత్రి జైపాల్​ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్​లో నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై జైపాల్​ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జైపాల్​ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జైపాల్​ రెడ్డి సంస్మరణ సభలో రాజకీయ ప్రముఖుల సంతాపం

By

Published : Aug 4, 2019, 1:57 PM IST

హైదరాబాద్​లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో​ కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ ప్రముఖులు జైపాల్​రెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జైపాల్​ రెడ్డి , తాను ఒకే జిల్లా నుంచి వచ్చిన శాశ్వత స్నేహితులమని సీపీఐ జాతీయ నేత సురవరం అన్నారు. "లైఫ్​ లాంగ్​ ఫ్రెండ్​... పర్మినెంట్​ పొలిటికల్​ అపోనెంట్​" అని జైపాల్​ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకున్నారు. దేశరాజకీయాలపై తనదైన ముద్రవేసిన జైపాల్​ రెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని సుధాకర్​ రెడ్డి తెలిపారు. జైపాల్​ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళం విప్పిన మహబూబ్​నగర్​ ముద్దుబిడ్డి జైపాల్​ రెడ్డి అని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. జైపాల్​రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

'తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మేధావి'

ఇదీ చూడండి: జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

jaipalreddy

ABOUT THE AUTHOR

...view details