సికింద్రబాద్‌లోని జాహ్నవి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానించారు. అనంతరం ర్యాంప్ వాక్ నిర్వహించారు. డీజే చప్పుళ్లకు, సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.
ఆటపాటలతో జూనియర్లను ఆహ్వానించిన విద్యార్థులు - jahanvi college freshers day celebrations
సికింద్రాబాద్ జాహ్నవి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు.
![ఆటపాటలతో జూనియర్లను ఆహ్వానించిన విద్యార్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5084791-402-5084791-1573906913454.jpg)
ఆటపాటలతో జూనియర్లను ఆహ్వానించిన విద్యార్థులు
విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు వారి మధ్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ఛైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆయన ఆశించారు. ఉత్తమ డాన్స్ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఆటపాటలతో జూనియర్లను ఆహ్వానించిన విద్యార్థులు
ఇవీ చూడండి: మాయమవుతున్న మానవత్వం..?