తెలంగాణ

telangana

ETV Bharat / state

"సైలంట్​గా ఉన్న చంద్రబాబు.. తెలంగాణకు ఎందుకొచ్చారంటే..​" - తెలంగాణ తాజా వార్తలు

Jaggareddy comments on BRS: రాజకీయ బతుకునిచ్చిన చెట్టును కేసీఆర్​ నరుక్కున్నారని కాంగ్రెస్​ నేత​ జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతో కేసీఆర్​ బలం పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి​ ఏపీకి వెళ్తున్నారు కాబట్టే.. చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఇకపై కేసీఆర్​తో ఆడుకుంటారని ఎద్దేవా చేశారు.

Jaggareddy
Jaggareddy

By

Published : Dec 26, 2022, 2:35 PM IST

Jaggareddy comments on BRS: ముఖ్యమంత్రి కేసీఆర్​పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్​ చంపేశారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ బతుకునిచ్చిన చెట్టును కేసీఆర్ నరుక్కున్నారని దుయ్యబట్టారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే ఆయన బలం పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు రాజకీయ ప్రవేశంపై జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నందునే.. చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Jaggareddy comments on chandra bubu in Telangana reentry: సైలెంట్‌గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి రావడానికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని ఆరోపించారు. చంద్రబాబు ఇకపై కేసీఆర్‌తో ఆడుకుంటారని తెలిపారు. కేసీఆర్​ ఏపీలో అట్రాక్ట్​ చేయలేరని.. బాబు మాత్రం ఇక్కడ రాజకీయాల్లో ప్రభావం చూపుతారని ఆయన జోస్యం చేశారు. ఇకపై తెలంగాణలో సీరియస్ రాజకీయాలు నడుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనార్టీలకు రుణాలివ్వడం ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం మైనార్టీలకు కేటాయించిన రూ. 120 కోట్లను కనీసం రూ. 1500 కోట్లకు పెంచాలని జగ్గారెడ్డి డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details