తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆయనకు తప్ప ఎవరికి పీసీసీ ఇచ్చినా ఓకే: జగ్గారెడ్డి - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్​రెడ్డిపై వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డికి తప్పించి.. ఎవరికి పీసీసీ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అడుగుతున్నారని.. అదిష్ఠానం అడిగితే ఆయనకు ఇవ్వొద్దని చెబుతానన్నారు. తన అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్‌ రెడ్డికి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానన్న జగ్గారెడ్డి... తన రాజకీయం తనకుంటుందని స్పష్టం చేశారు.

jaggareddy comment on PCC to anyone except revanth reddy
'తనకు తప్ప ఎవరికి పీసీసీ ఇచ్చినా ఓకే'

By

Published : May 31, 2020, 5:40 PM IST

తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పునరుద్ఘాంటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా విఫలం చెందారన్నది అనవసర నిందగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్‌ రెడ్డిపై నిందలు వేయడం సరికాదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పేరుతో గెలిచే వాళ్లు కొందరు.. సొంత ఇమేజ్​తో గెలిచే వాళ్లు మరి కొందరు ఉన్నారని అన్నారు. అందరిని గెలిపిస్తానని తిరిగిన రేవంత్‌ రెడ్డి.. ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.

ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్..

ఒక్క ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్ ఇంత హడావుడి చేస్తున్నారని.. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ ఏం చెప్పుకోవాలని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ ఆర్సీ కుంతియా చుట్టూనే కొందరు కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. నాపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడితే తన కుమార్తె జయారెడ్డి రాజకీయాల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్​రెడ్డిని మార్చాల్సిన అంశంపై తాను రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తానన్నారు. వచ్చే ఎన్నికలు కూడా ఉత్తమ్‌ చేతుల మీదుగా నడిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఇదీ చూడండి :'తెలంగాణలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details