ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి యత్నం... దారిలో అరెస్ట్ - MLA JAGGAREDDY ARREST
హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విఫలయత్నం చేశారు. మార్గమధ్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : జగ్గారెడ్డి
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జూబ్లీ హిల్స్ ఠాణాకు తరలించారు. కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని అణచివేస్తోందని మండిపడ్డారు. కార్మికుల ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.