Jagga reddy comments on KTR and Harishrao : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే హామీల అమలుపై బీఆర్ఎస్(BRS) విమర్శలు చెయ్యడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. పది రోజులకే ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం సబబు కాదన్నారు. పేద ప్రజలను ఆదుకోడానికి సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారని, ప్రజలు నమ్మారు కాబట్టే అధికారాన్ని కట్టబెట్టారన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు 2024 - తెలంగాణలో ఆ స్థానం నుంచే సోనియా గాంధీ పోటీ!
బస్సులో మహిళలు ప్రయాణించట్లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు రెచ్చిపోతున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎప్పుడూ లగ్జరీ కారుల్లో తిరుగుతారని, ఆర్టీసీ బస్సుల్లో తిరగరు కాబట్టే ఈ పథకం విలువ వాళ్లకేమీ తెలియదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగేవి కావన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
Jagga reddy fires BRS :ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanthreddy) ఆరు గ్యారెంటీల అమలుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో సంతకం చేశారన్నారు. అధికారం చేపట్టిన 48 గంటల్లో రెండు పథకాలు అమలు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంతో ముఖ్యంగా విద్యార్థినిలకు మేలు జరుగుతోందన్నారు.
యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ
ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచారని, ఈ పథకంతో పేదల ఆరోగ్యానికీ భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజా పాలన అన్నారు కానీ, రేవంత్ రెడ్డి పాలన అని పిలవడం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు పెండింగ్ ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులకు లక్ష రుణం మాఫీ కాకపోగా మరో లక్ష వడ్డీ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్న ఆయన, పేదల కష్టాలు కేసీఆర్ కుటుంబానికి తెలియవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన జగ్గారెడ్డి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు.
"బస్సులో మహిళలు ప్రయాణించట్లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు రెచ్చిపోతున్నారు. అసెంబ్లీలో నేను ఉండి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగేవి కావు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు లక్ష రుణం మాఫీ కాకపోగా మరో లక్ష వడ్డీ అయింది".- జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
నేను అసెంబ్లీలో ఉంటే వారితో ఆడుకునేవాణ్ని : జగ్గారెడ్డి ప్రజావాణిలో తగ్గిన అర్జీల సంఖ్య - ఖాళీగా దర్శనమిస్తున్న క్యూలైన్లు