తెలంగాణ

telangana

ETV Bharat / state

జగత్​ విఖ్యాత్​ రెడ్డి బెయిల్ పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా - jagat vikyat reddy latest news

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితుడిగా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై తీర్పును సికింద్రాబాద్ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్టయిన 15 మంది నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

jagat vikyat reddy pre bail petition trial is adjourned until tomorrow
జగత్​ విఖ్యాత్​ రెడ్డి బెయిల్ పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

By

Published : Jan 29, 2021, 7:58 PM IST

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సికింద్రాబాద్ న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో జగత్‌కు బెయిల్‌ మంజూరు చేయొద్దని, బెయిల్‌ ఇస్తే అతను సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

ఇదే కేసులో అరెస్టయిన 15 మంది నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. భార్గవరామ్ తల్లి కిరణ్మయి, సోదరుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్లనూ అదే రోజు విచారించనుంది.

ఇదీ చూడండి: జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details