తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: ఏపీ సీఎం జగన్ - ఏపీ తాజా వార్తలు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్​లో ఎన్నడూలేని విధంగా రూ. కోటి ప్రోత్సాహకం ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేలా కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారికోసం జగనన్న వైఎస్​ఆర్ బడుగు వికాసం పథకాన్ని ప్రారంభించారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: ఏపీ సీఎం జగన్
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: ఏపీ సీఎం జగన్

By

Published : Oct 26, 2020, 2:59 PM IST

ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 'జగనన్న-వైఎస్సార్ బడుగు వికాసం' పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 2020-23 సంవత్సరాలకుగానూ ఈ నూతన పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ-ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఉద్దేశించిన జగనన్న- వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్​ ఎస్సీ, ఎస్టీలలో నైపుణ్యాలను పెంచేందుకు కొత్త కార్యక్రమాల్ని చేపడుతున్నామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం కోటి రూపాయల ప్రోత్సాహకాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నామని జగన్​ వివరించారు. ఏపీవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం మేర ఎస్సీలకు, 6 శాతం మేర ఎస్టీలకు భూములు కేటాయించనున్నట్టు సీఎం వెల్లడించారు. వీరికి స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ , క్వాలిటీ సర్టిఫికేషన్, పెటెంట్ రుసుముల్లో రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కూడా నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సచివాలయాల్లో 82 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని జగన్​ వ్యాఖ్యానించారు. మరోవైపు పరిశ్రమలను స్థాపించాలనుకునే ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు పూర్తి సమాచారం లభ్యం అయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్​ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

ABOUT THE AUTHOR

...view details