టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో జర్మనీపై గెలిచి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు.. చరిత్ర సృష్టించిందని సంతోషం వ్యక్తం చేశారు. యువతకు స్ఫూర్తి కలిగించే విజయమని కొనియాడారు. సుధీర్ఘకాలం తర్వాత భారత హాకీ.... పూర్వ వైభవాన్ని గుర్తుచేసిందని అన్నారు.
సాహో.. హాకీ ఇండియా!! సాహో మన్‌ప్రీత సేన!! సాహో భారత్!!
పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది. పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు. జర్మనీలో టిముర్ ఒరుజ్ (2ని), నిక్లాస్ వెలెన్ (24ని), బెనెడిక్ట్ ఫర్క్ (25ని), లుకాస్ విండ్‌ఫెదెర్ (48ని) రాణించారు.
ముఖ్యాంశాలు
- 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి పతకం
- ఒలింపిక్ హాకీలో భారత్‌కు ఇది 12వ పతకం
- మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీకి ఇదే తొలి పతకం
- 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత్
- 12 పతకాలతో ఒలింపిక్ హాకీలో ఇప్పటికే అగ్రస్థానంలో భారత్
- ప్రస్తుతం భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు
ఇవీ చూడండి: