హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇవాళ విచారణకు పారిశ్రామికవేత్తలు ఎన్.శ్రీనివాసన్, అయోధ్యరామిరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. విశ్రాంత అధికారులు శామ్యూల్, మన్మోహన్‌సింగ్, రాజగోపాల్, కృపానందం విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు. సీఎంగా పలు కార్యక్రమాలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు అందుకు సమ్మతించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
నేటి విచారణలో.. సీఎం జగన్‌కు మినహాయింపు
హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. విచారణకు పలువురు విశ్రాంత అధికారులతో పాటు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ప్రజాకార్యక్రమాలు ఉండడం వల్ల మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు అందుకు సమ్మతించింది.
నేటి విచారణలో.. సీఎం జగన్‌కు మినహాయింపు