తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా - Jagan cases news

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడుల ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జీ పిటిషన్​పై వాదనలు కొనసాగాయి. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ రేపటికి వాయిదా
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ రేపటికి వాయిదా

By

Published : Nov 3, 2020, 7:03 PM IST

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడుల ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జీ పిటిషన్​పై వాదనలు కొనసాగాయి. ఓఎంసీ అక్రమాల కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేశారు.

ఓఎంసీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు. గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జీ పిటిషన్​లో కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ వాయిదా వేయాలని వీడీ రాజగోపాల్ పిటిషన్ వేశారు.

సరిహద్దు వివాదంపై సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని రాజగోపాల్ కోరారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో ఏసీబీ కోర్టులో సాక్షుల విచారణ కొనసాగింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

ఇదీ చదవండి:ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక.. 10న లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details