సీబీఐ, ఈడీ కోర్టుల్లో నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. పెన్నా గ్రూప్ కేసులో అనుబంధ చార్జ్‌షీట్‌పై సీబీఐ కోర్టు.. ఇవాళ విచారణ ప్రక్రియను ప్రారంభించనుంది. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్, గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్, డీఆర్ఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ విచారణకు హాజరుకానున్నారు.
నేడు ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు న్యూస్
హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరగనుంది. పెన్నా గ్రూప్‌నకు సంబంధించిన కేసులో పలువురు ముఖ్యులు కోర్టుకు హాజరుకానున్నారు.
సీబీఐ, ఈడీ కోర్టుల్లో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
పెన్నా గ్రూప్‌నకు భూములు, గనుల కేటాయింపుల్లో సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఇతర అధికారులు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నేరానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న... పెన్నా గ్రూప్ అధినేత ప్రతాప్ రెడ్డి పిటిషన్ పైనా నేడు వాదనలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రపతి నిలయం సందర్శనకు నేడు చివరి రోజు
Last Updated : Jan 17, 2020, 8:02 AM IST