హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై కేసు విచారణ జరిగింది. విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరగా.. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈనెల 11నుంచి ఆగస్టు 2వరకు హైదరాబాద్ దాటి వెళ్లొచ్చని చెప్పింది. రూ.5 లక్షల బాండ్‌ను సమర్పించాలని ప్రసాద్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది.
దేశంలోని వివిధ ప్రాంతాలకు నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుమతి - సీబీఐ జగన్ వార్తలు
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ఈ కేసులో దేశంలోని వివిధ ప్రాంతాలకు నిమ్మగడ్డ ప్రసాద్‌కు కోర్టు అనుమతిచ్చింది.
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు.. అరబిందో, ఇండియా సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ కేసుల విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఎమ్మార్ కేసు విచారణను ఈనెల 24కు, దాల్మియా సిమెంట్స్ కేసు విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.