మినీ పుర పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా... ఈ నెల 19న అభ్యర్థుల నామపత్రాలు పరిశీలించనున్నారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.
మినీ పురపోరుకు నోటిఫికేషన్ విడుదల
11:13 April 15
మినీ పురపోరుకు నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 30న రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. మే 3న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు సైతం నోటిఫికేషన్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు ఉపఎన్నిక సహా... మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు నోటిఫికేషన్ జారీ అయింది. గజ్వేల్, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి.
సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కానుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:‘పది’ పరీక్షల రద్దుకే మొగ్గు... ఇంటర్ ద్వితీయ పరీక్షల వాయిదా?