ఉపాధ్యాయ సంఘాల జాక్టో పోరాట కమిటీ ఆధ్వర్యంలో... ఈ నెల 29న ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను కాచిగూడలోని యస్టీయూ భవన్లో జాక్టో నాయకులు విడుదల చేశారు.
పదోన్నతలు కల్పించాలి... బదిలీలు చేపట్టాలి: జాక్టో - ధర్నాచౌక్ వద్ద ధర్నా వార్తలు
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 29న ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని సూచించారు.
అప్గ్రేడెడ్ పండిట్, పీఈటీలతో సహా అన్ని కేటగిరిలలో పదోన్నతలు కల్పించాలని, బదిలీలు నిర్వహించాలని జాక్టో నాయకులు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించి... పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఈనెల 29న అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద... పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
ఇదీ చూడండి:ప్రగతిభవన్ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం